Monday, February 24, 2025
HomeTrending Newsరోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు

రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు

న్యూఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపాయి. రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టార్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కోర్టుకు వచ్చిన జితేంద్ర టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. గోగిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం.

30 ఏళ్ల జితేంద్ర గోగి గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేంద్రపై ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్తికి తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్