ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై సింగపూర్ ఆంక్షలు సడలించింది. ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్ళే ప్రయాణికులు లేదా సింగపూర్ మీదుగా ఇతర దేశాలకు వెళ్ళే వారిపై సింగపూర్ కఠినమైన షరతులు పెట్టింది. కరోనా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ఆంక్షలు సడలించినట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 26 అర్ధరాత్రి 23.59 గంటల నుంచి కొత్త నిభందనలు అమలులోకి వస్తాయి.
భారత్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్ దేశాల పౌరులకు తాజా నిభందనలు వర్తిస్తాయి. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల 14 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు రిపోర్టులు పరిశీలించాకే అనుమతిస్తారు. కోవిడ్ 19 నివారణకు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారిని అనుమతిస్తారు.