Wednesday, January 22, 2025
HomeTrending NewsNew York: న్యూయార్క్ నగరానికి ముప్పు

New York: న్యూయార్క్ నగరానికి ముప్పు

అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం ఇందుకు కారణమని తెలిపింది. అధ్యయనంలోని అంశాల్ని ‘ఎర్త్స్‌ ఫ్యూచర్‌’ సైన్స్‌ జర్నల్‌ తాజాగా ప్రచురించింది. న్యూయార్క్‌లో 10లక్షలకుపైగా ఆకాశాన్ని తాకే భవనాలున్నాయి. వీటి బరువు సమారుగా 76,200 కోట్ల కిలోలుందని, భూ ఉపరితలంపై ఒత్తిడి ఏర్పడి నగరం ఏటా సగటున 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగిపోతున్నదని, కొన్ని చోట్ల భవనాలు రెండు అడుగుల వరకు కుంగిపోయే అవకాశముందని పరిశోధకులు అంచనావేశారు.

‘సముద్రమట్టం మెల్ల మెల్లగా పైకి వస్తోన్న సంగతిని శాటిలైట్‌ చిత్రాలు చెబుతున్నాయి. భారీ తుఫాన్లు సంభవిస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. నగరానికి భీకరమైన ముప్పు వాటిల్లే ప్రమాదముంది’ అని అధ్యయనంలో సహ రచయిత టాప్‌ పార్సన్స్‌ చెప్పారు. మన్‌హట్టన్‌, బ్రూక్లీన్‌, క్వీన్స్‌ ప్రాంతాలు భూమిలో కుంగిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్