Saturday, April 20, 2024
HomeTrending Newsసినిమా థియేటర్లలో తాగునీరు ఉచితం

సినిమా థియేటర్లలో తాగునీరు ఉచితం

సినిమా థియేటర్‌లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. జీ దేవరాజన్ 2016లో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో ఇలా తేలింది. కొన్ని థియేటర్ల వారు సెక్యూరిటీ రీజన్స్ తో బయటి బాటిల్స్ ను అనుమతించడం లేదని జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం బెంచ్ వెల్లడించింది.

తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వాటర్ బాటిల్స్, జ్యూస్, ఫుడ్ స్టాల్ లో ఆహారపదార్థాలు అమ్ముతున్నారంటూఓ వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన తమిళనాడు ఉన్నత న్యాయస్థానం సినిమా థియేటర్లలో అక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

డ్రింకింగ్ వాటర్ ను బయట నుంచి అనుమతించకుండా నిషేదిస్తే కచ్చితంగా ఫ్రీగా అందించాలి. స్వచ్ఛమైన తాగునీటిని వాటర్ కూలర్స్ ద్వారా సినిమాహాల్స్ లోనే ఏర్పాటు చేయాలి. అలాంటి నిషేదాజ్ఞలు చేసే ముందే వీటిని ఉంచాలి’ అని కోర్టు ఆర్డర్ వేసింది.వాటర్ ప్యూరిఫైర్స్ ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలని ఆదేశించింది. డ్రింకింగ్ వాటర్ కేవలం ఇంటర్వెల్ సమయంలో మాత్రమే కాకుండా సినిమా ఆరంభం కంటే ముందు నుంచి అందుబాటులో ఉండాలి. ఏదైనా కారణంతో ఒక రోజు తాగు నీరు సరఫరా చేయలేకపోతే ప్రత్యేక అరేంజ్మెంట్లు చేయాలి. ఆదేశాలను పట్టించుకోకుండా ఏదైనా హాల్ ఇష్టారీతిన వ్యవహరిస్తే తగు చర్యలు తప్పవని హైకోర్ట్ హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్