Tuesday, April 16, 2024
HomeTrending Newsవడ్ల కోసం కదిలిన గులాబి దండు

వడ్ల కోసం కదిలిన గులాబి దండు

TRS Party Concerns Will Not Go Away Until The Grain Is Bought

ఏసంగి వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెరాస నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు కోదాడ నుంచి జహీరాబాద్ వరకు తెలంగాణ వ్యాప్తంగా గులాబి దండు కదిలింది.

సిరిసిల్ల కేంద్రంలో తెలంగాణ రైతుల మహా ధర్నా లో పాల్గొన్న మంత్రి కేటిఆర్. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని మంత్రి కేటిఆర్ విమర్శించారు. ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని అంబెడ్కర్ రాజ్యాంగములో రాసారని, ఎక్కడ ఏ పంటలు పండించాలో కేంద్రం చెప్పాలన్నారు. మనం జై కిసాన్ అంటుంటే వాళ్ళు నై కిసాన్ అంటున్నారని, బండి సంజయ్ కు ఒక్కటే సవాల్ కేంద్రం వరి పంట కొంటదా లేదా చెప్పాలన్నారు. శివాజీ బొమ్మలు హిందూ ముస్లిం అంటూ గోల తప్ప ఏముందని, నాలుగు చిల్లర ఓట్లకోసం బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి పట్టణం వివేకానంద చౌరస్తా వద్ద కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతు గా తెరాస శ్రేణుల మహాధర్నా జరిగింది. ఈ మహాధర్న కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా  కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని  డిమాండ్ చేస్తూ జగిత్యాల తహసీల్ చౌరస్తా ఆర్డీవో కార్యాలయం వద్ద  రైతన్నల నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ,రైతులు  తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వరిధాన్యం కొనేది లేదన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగానికి మద్దతుగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బల్క సుమన్ పాల్గొన్నారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద వేలాది మంది రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో దర్నా నిర్వహించారు. ఎండ్లబండిపై దర్నా జరిగే కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి గంగుల ఎడ్లబండిపై నుండే అధికారులకు విజ్ణాపణ పత్రాన్ని సమర్పించారు.

కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోళ్ళలో అవలంబిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ… మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులతో తెలంగాణ చౌరస్తా నుండి జడ్పీ గ్రౌండ్ వరకు  పాదయాత్ర నిర్వహించిన అనంతరం ధర్నా లో పాల్గొన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ను వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్లపై ఆందోళనల్లో కూర్చోబెట్టింది కేంద్ర ప్రభుత్వమని ఎంపి రంజిత్ రెడ్డి విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గ రైతు ధర్నాలో ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి లోక్ సభ సభ్యులు డా. జి. రంజిత్ రెడ్డి  పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తహశీల్దార్ కార్యాలయం ముందు  మహాధర్నా. ధర్నా లో భారీ సంఖ్యలో  పాల్గొన్న నియోజకవర్గo లోని రైతులు , తెరాస కార్యకర్తలు

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతు లకు మద్దతు గా టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ధర్నాకు  పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు ,పార్టీ శ్రేణులు. కెసిఆర్ ఉచిత విద్యుత్ ఇస్తుంటే మోడీ ప్రభుత్వం ఆ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో ధ‌ర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్  చేశారు.

ఖమ్మం నియోజకవర్గ కేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎడ్లబండి పై ధర్నా చౌక్ కు వచ్చిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి. పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్న రైతులు, పార్టీ శ్రేణులు.

కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన రైతన్నల ధర్నాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే అని సామాన్య రైతులకు తెలిసిన విషయం బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు తెలియకపోవడం విడ్డూరమని మంత్రి విమర్శించారు. బీజేపీ పాలనలో నకిలీ విత్తనాల తయారీ దారులకు, డ్రగ్స్ మాఫియాకు, బ్యాంకు రుణాల ఎగవేతదారులకు గుజరాత్ అడ్డాగా మారిందన్నారు. ఎగ్గొట్టిన అప్పులు మాఫీ చేసిన కేంద్రం రైతుల ధాన్యం కొనడానికి నిరాకరిస్తుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని  కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ రైతు సంఘీభావ మహా ధర్నా చేశారు.

శుక్రవారం సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, టి ఆర్ యస్ పార్టీ నేతలతో పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతాంగాన్ని ఉద్దేశించి మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగించారు. అసలు ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అన్నది బిజెపి నాయకత్వం తేల్చిచెప్పాలని ఆయన నిలదీశారు.

రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలోని BJP ప్రభుత్వం పీటం కదిలిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో రైతులకు సంఘీభావంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో TRS పార్టీ ధర్నా నిర్వహించారు. వారి కంకులు, వారి ధాన్యం తో నిరసన తెలిపారు. ఈ ధర్నా లో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, MLC లు సురభి వాణిదేవి, MS. ప్రభాకర్, MLA లు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుదీర్ రెడ్డి, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : వడ్లగింజలో బియ్యపుగింజ రాజకీయం

వడ్ల కొనుగోలుకు కేంద్రాన్ని వెంటాడుతాం

యేసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్