Wednesday, March 11, 2026
HomeTrending Newsరాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఓమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు  లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ చేయాలని, ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచన. కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశం. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తింపు. హాట్‌ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచన.

పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి. తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలి. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచన. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని సూచన. తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని సూచన. ఓమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాల్లో గుర్తింపు.

ఒమైక్రాన్ వేరియంట్ దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం – అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై వెనక్కి తగ్గిన కేంద్రం – అంతర్జాతీయ విమాన రాకపోకలపై బ్యాన్ కొనసాగింపు 

Also Read : ఒమిక్రాన్‌..ఆంక్షలు షురూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular