Friday, September 20, 2024
HomeTrending Newsఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

ఉగ్రవాద నిర్మూలన, విమానయాన రంగంలో భద్రత, అంతరిక్ష రంగంలో సహకరించుకోవాలని అమెరికా- ఇండియా అవగాహనకు వచ్చాయి. టెర్రరిజం ఎదుర్కునేందుకు రెండు దేశాలు ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయానికి వచ్చాయి. వాషింగ్టన్ శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడిల సమావేశం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. బైడెన్ గెలిచాక మొదటి సారిగా ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

ఉగ్రవాదులు అంతర్జాలం ఆధారంగా విస్తరిస్తూ మానవాళికి ముప్పుగా పరిణమించారని టెర్రరిజం మూలాల్ని పెకిలించేందుకు రెండు దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని బైడెన్ – మోడీ తీర్మానించారు. ప్రపంచంలో బలమైన రెండు ప్రజాస్వామ్య దేశాలు ఇండియా, అమెరికా మానవ హక్కుల పరిరక్షణకు మరింత కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణ అరికట్టేందుకు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని అంగీకారానికి వచ్చారు. హిందూ మహాసముద్రం – పసిఫిక్ మహా సముద్ర జలాల్లో రెండు దేశాల నావికా దళాలు మాదక ద్రవ్యాల నిరోధానికి సహకరించుకోవాలని నిర్ణయించారు.

 

రక్షణ రంగంలో మానవ రహిత విమానాలు, వాహనాల అభివృద్దికి ఇదివరకే జరిగిన ఒప్పందాన్ని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని నేతలు అవగాహనకు వచ్చారు. ఈ ఏడాది చివరలో సీనియర్ అధికారుల భేటి జరిపి రెండు దేశాల మిలిటరీ బలగాలు భుజం భుజం కలిపి ముందుకు సాగేలా కార్యక్రమాలు రూపకల్పన చేయటం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్