Friday, October 18, 2024
Homeసినిమాలూసిఫర్ డైరెక్టర్ మారలేదు. ఇదే.. సాక్ష్యం.

లూసిఫర్ డైరెక్టర్ మారలేదు. ఇదే.. సాక్ష్యం.

మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఆమధ్య ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. ఆచార్య సినిమా పూర్తైన తర్వాత సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుంటే.. ఇటీవల కాలంలో లూసిఫర్ గురించి చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు మోహన్ రాజా కథలో చేసిన మార్పులు – చేర్పులు చిరంజీవికి నచ్చలేదని.. అందుచేత మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసారనే టాక్ కూడా వచ్చింది.

అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల్లో వాస్తవం లేదని.. లూసిఫర్ దర్శకుడు మోహన్ రాజే.. అందులో ఎలాంటి మార్పులేదని క్లారిటీ వచ్చేసింది. విషయం ఏంటంటే.. ఈ రోజు దర్శకుడు మోహన్ రాజా పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు తమ దర్శకుడికి బర్త్ డే విషెస్ తెలిపాయి. అంతే కాకుండా.. మా #చిరు153 దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలియచేస్తూ పోస్టర్స్ ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాయి. ఈవిధంగా ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని.. లూసిఫర్ రీమేక్ దర్శకుడు మోహన్ రాజే అని క్లారిటీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్