చిరు, మల్లిడి వశిష్ట్ ప్రాజెక్ట్ ఇంట్రస్టింగ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’.  మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నారనేది ప్రకటించలేదు కానీ.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇది సోసియో ఫాంటసీ మూవీ అని టాక్ వినిపిస్తుంది. ఈ కథ చిరుకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారని..  ఇవన్నీ కీలక పాత్రలు అని వార్తలొస్తున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆ ఎనిమిది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటాయో వాళ్లతో ఈ పాత్రలను చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్. ఇందులో చిరు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట.

బింబిసార తర్వాత డైరెక్టర్ వశిష్ట్ బింబిసార 2 చేస్తారనుకున్నారు కానీ.. ఊహించిన విధంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాడని ఎవరూ అనుకోలేదు. బింబిసార 2 కి కథ మాత్రం మల్లిడి వశిష్టే అందించాడట కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సివచ్చిందట. ఇప్పుడు చిరుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో ఈసారి కూడా బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో కథ రెడీ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *