Saturday, November 23, 2024
HomeTrending Newsకేరళతో దక్షిణాదికి థర్డ్ వేవ్ ముప్పు  

కేరళతో దక్షిణాదికి థర్డ్ వేవ్ ముప్పు  

కేరళలో అన్ని రకాల దుకాణాలు, మాల్స్ వినియోగదారుల కోసం తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 11 వ తేది నుంచి మాల్స్, దుకాణాలు ఓపెన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక దూరం, మాస్కులు ఇతర ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. షాపుల్లో కరోన రక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి.

ఓ వైపు కరోన కేసులు పెరుగుతుంటే మాల్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కేరళ చర్యలపై కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆ రాష్ట్రం నుంచి మిగతా ప్రాంతాలకు వెళితే కట్టడి చేయటం కష్టమని వైద్య వర్గాలు చెపుతున్నాయి.  టూరిస్టులు, ఉద్యోగ వర్గాలు, ఇతర పనులపై వెళ్ళే వారు పొరుగు రాష్ట్రాలకు రావటం సాధారణమని అలాంటి వాళ్ళ ద్వారా మహమ్మారి వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో రైలు, బస్సు ప్రయాణాలకు పూర్తి స్థాయిలో అనుమతించారు. విమానయానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, రైలు, రోడ్డు ప్రయాణాలపై ఎలాంటి నియంత్రణలు లేవు. లాక్ డౌన్ ద్వారానే నియంత్రణ సాధ్యం అవుతుంది. స్కూల్స్ నుంచి మాల్స్ వరకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు మహమ్మారి తీవ్రత పెరిగితేనే మళ్ళీ రక్షణ చర్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోతే మూడో దశ ముప్పు తప్పదని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

రోజుకు ఇరవై వేల కేసుల పైచిలుకు వస్తున్నాయి. శనివారం సుమారు 140 మంది కరోనతో చనిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు లక్షా 80 వేలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్