Friday, March 20, 2026
Homeసినిమాగౌతమ్ ప్రాజెక్ట్ కి చరణ్‌ నో చెప్పడానికి కారణం ఇదే

గౌతమ్ ప్రాజెక్ట్ కి చరణ్‌ నో చెప్పడానికి కారణం ఇదే

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అయితే.. త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపించాడు. నార్త్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా మూవీస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే గౌతమ్ తిన్న నూరితో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని చరణ్ తిరస్కరించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అదే ప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ని చరణ్‌ క్యాన్సిల్ చేయడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. మేటర్ ఏంటంటే… ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా బ్రిటీష్ పాలకులకు అండగా నిలిచే పోలీస్ అధికారికగా కనిపించారు. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని చరణ్ రిజెక్ట్ చేయడానికి కారణం పోలీస్ క్యారెక్టరే నని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో సాగే కథ కావడం.. అందులో చరణ్ పాత్ర పోలీస్ పాత్ర కావడంతో మరోసారి పీరియాడిక్ ఫిల్మ్ లో మళ్లీ పోలీస్ పాత్రలో నటించడం ఇష్టం లేకే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని చరణ్ రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తల ప్రకారం విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా పీరియాడిక్ ఫిల్మ్ అని సమాచారం. ఇది తెలియని వారంతా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి ల ప్రాజెక్ట్ ఫ్లస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత చరణ్ మంచి ప్రాజెక్ట్ ని వదులుకున్నాడని ఇంత మంచి సినిమాని చరణ్ ఎందుకు వదులుకున్నాడో అర్థం కాలేదని అంతా అనుకున్నారు కానీ.. ఈ మూవీ స్టోరీ తెలిసిన తర్వాత చరణ్ తీసుకున్న నిర్ణయం సరైనేదే అనిపిస్తుంది. మరి.. ‘లైగర్’ తో వెనకబడిన విజయ్ దేవరకొండ ‘ఖుషి’, గౌతమ్ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular