Saturday, January 18, 2025
HomeTrending Newsరాజాసింగ్ న్యాయవాదికి బెదిరింపు ఫోన్ కాల్స్

రాజాసింగ్ న్యాయవాదికి బెదిరింపు ఫోన్ కాల్స్

అడ్వొకేట్ కరుణాసాగర్ నిన్ను చంపేస్తాము ,రాజా సింగ్ కేసు నుండి తప్పుకో. ..ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో కరుణాసాగర్ పలు పోలీస్ స్టేషన్లలో రక్షణ కలిపించాలంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కేవలం ఆఫీస్ వరకే రక్షణ కలిపించారు. అంటే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లాకా పోలీస్ రక్షణ ఉండదని పోలీసులు వెల్లడించారు. ఇంతటి సీరియస్ ఇష్యూ ఉన్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జరగరానిది ఏమైనా జరిగితే మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయవాద సంఘాలు హెచ్చరించాయి.

ఎలాంటి జాప్యం చెయ్యకుండా న్యాయవాది సాగర్‌ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తు…ఈ దిశగా పోలీసులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి కరుణాసాగర్ తరపున రక్షణ పిటిషన్‌ను పంపారు. తక్షణం పోలీసులు న్యాయవాది సాగర్ కి పూర్తి స్థాయి రక్షణ కలిపించాలంటు పలు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్