రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేశ్ ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. 1970-80 ల ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఇది. అందుకే ఈ సినిమా కోసం ఆనాటి పరిస్థితులను చూపించడానికి ఏకంగా ఐదు ఎకరాల స్థలంలో స్టువర్టుపురం లొకేషన్స్ ను నిర్మించారట మేకర్స్. ఇందులో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం.ఇక తాజాగా సినిమా విడుదల తేదీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బొగ్గు రైలు ఇంజన్ పైన ఓ వ్యక్తి నిలుచొని కనిపిస్తున్నాడు. బహుశా ఇది రవితేజ పాత్రనే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాను అక్టోబర్ 20 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు మేకర్స్.

రవితేజ. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్. ఏకంగా సినిమా విడుదల తేదీను ప్రకటించేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక రీసెంట్ గా ‘రావణాసుర’ సినిమాలో నటించారు. ఈ మూవీను ఏప్రిల్ 7 న థియేటర్లలో విడుదల చేయనున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కూడా రవితేజ నెగిటివ్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని తర్వాత వెంటనే దసరా పండుగ టార్గెట్ గా ‘టైగర్ నాగేశ్వరరావు’ ను రెడీ చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *