దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 20వ తేది నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడతారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ దఫా ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో వోట్ ఫ్రం హోం (Vote From Home) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 80 ఏళ్ళ పై బడిన వృద్దులు, అంగ వైకల్యం ఉన్న వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.

మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్‌ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *