Sunday, March 15, 2026
HomeTrending NewsSun Stroke or Heat Stroke: వడదెబ్బ..ప్రథమ చికిత్స

Sun Stroke or Heat Stroke: వడదెబ్బ..ప్రథమ చికిత్స

ఎండలు తీవ్రంగా ఉన్నపుడు మనిషి శరీరంలో మెదడులో ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతినడం వల్ల వడదెబ్బ వస్తుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40 శాతం మరణాలు సంభవిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైనది.

చేయవలసిన ప్రథమ చికిత్స :—

వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి తీసుకువెళ్ళాలి.
ఆ వ్యక్తి శరీరం పై ఉండే దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగటం గానీ, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవటం చేయాలి.
శరీరం అంతా చల్లని గాలి తగిలేలా చూడాలి.
వారికి చల్లని నీరు లేదా మజ్జిగ లేదా కొబ్బరినీరు లేదా నిమ్మరసం లేదా ORS ద్రావణం (చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన ద్రావణం) త్రాగించాలి.
సమయం వృధా చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి క్రింది సూచనలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి.

“వేసవిలో పాటించాల్సిన సూచనలు” :–

*సాద్యమైనంతవరకు మద్ధ్యాహ్నం ఎండలో తిరుగకూడదు. తప్పనిసరి అయితే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తరువాత బయటకు వెళ్ళాలి.
*నీటిని ఎక్కువగా తీసుకోవాలి, నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
*పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలను ఎండ సమయంలో బయటకు పంపించకుండా జాగ్రత్త వహించాలి.

1) ఆహార పదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) మాంసపదార్థాలు తక్కువగా..ఆకుకూరలు , కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ త్రాగ కూడదు. వాటి కన్నా, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం చాలా మంచివి.
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి. బయట ఆడుకోవడానికి సాయంత్రం 5గంటల తరువాత మాత్రమే పంపించాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ, ఉప్పు వేసుకుని పలుచగా కలిపి పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే.
కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు తలపై టోపీ వంటివి ధరించండి.
16. వయస్సు 50 దాటిన వారు తమ ప్రయాణాలలో తప్పక మంచి నీరు, ORS Packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17. ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా
డీ-హైడ్రేషన్’కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18. వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్ తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
19. ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్’ను తీసుకెళ్ళండి. కూలింగ్ వాటర్ దొరుకుతుంది కదా అని ఫంక్షన్స్ లో ఎక్కువ తీసుకోకండి. దాహం తీరటం మాట అటుంచి గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
21. ఎక్కువ AC గదులలో కాక ఇంటి సాధారణ ఉష్ణోగ్రతకే అలవాటు పడాలి. ఎటయినా బయటకు వెళ్ళినప్పుడు వేడిని తట్టుకునే శక్తి కలుగుతుంది.
22. పిల్లలను సాయంత్రం 5గంటల తరువాత పార్కులకో మైదానాలకో తీసుకువెళ్ళాలి. రోజంతా ఇంటిలో ఉన్న వారికీ ఇదో ఆటవిడుపు.
23. పెళ్లిళ్ల సమయం కాబట్టి భోజనాలు చేయవలసి ఉంటుంది. మిగిలవాటితో కన్నా మజ్జిగ లేదా పెరుగును ఎక్కువ వాడాలి.
24. చంటి పిల్లలకు అన్నంలో నేయి వేసి పెడతాం. కానీ ఈ కాలంలో నెయ్యి తగ్గిస్తే మంచిది. దాహమయిన చెప్పలేరు, చిరాకు పడుతుంటారు..
25. పెద్దవారికి చలవ పానీయాలు ఇవ్వాలి.
26. చెరుకురస౦ ఐసు వేయకుండా తాగండి.
అరటిపండు ముక్కలుగా కోసి పాలతో కలిపి మిక్సిలో వేసి బనానా షేక్ చేయండి..పంచదార
బదులుగా తేనే కలిపితే బావుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular