Sunday, September 22, 2024
HomeTrending Newsబ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే : సుబ్బారెడ్డి

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే : సుబ్బారెడ్డి

కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, బ్రహ్మోత్సవాలకు అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి కరోనా నియంత్రణ సాధ్యం కాదని అయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఏడాదికి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ప్రస్తుతం చితూరు జిల్లా వాసులకే అందుబాటులో ఉన్న సర్వదర్శనం టోకెన్లను వచ్చేవారం నుంచి అందరికీ అందుబాటులో ఉంచుతామని, ఆన్ లైన్ లో సర్వదర్శన టోకెన్లు జారీని ప్రారంభిస్తామని తెలిపారు. అయితే కొంతకాలంపాటు పరిమిత సంఖ్యలోనే టోకెన్లు అందుబాటులో ఉంచుతామన్నారు.

అన్నమయ్య కీర్తనలకు మరింత ప్రారుచ్యం కల్పించేందుకు, నేటి యువతరంలో వాటిపై ఆసక్తి పెంచే విధంగా ‘అదివో అల్లదివో’ పాటల పోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. 15 నుంచి 25 సంవత్సరాల వయ్ససు కలిగిన వారు ఈ పాటల పోటిలో పాల్గోనవచ్చని తెలియజేశారు. ఈ పోటీలను జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో ఫైనల్స్ నిర్వహిస్తామని వివరించారు.

అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకూ తొమ్మిదిరోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11వ తేదీన సిఎం జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్