Sunday, November 24, 2024
HomeTrending NewsTirupathi IIT: జూన్‌ నాటికి క్యాంపస్‌ సిద్ధం

Tirupathi IIT: జూన్‌ నాటికి క్యాంపస్‌ సిద్ధం

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నింటినీ సిద్ధం చేసి అప్పగిస్తామని విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణ పనులు ఈనెలాఖరులోగా పూర్తి కావలసి ఉందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఐఐటిలు అన్నింటికి కలిపి 9361 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి చెప్పారు.

“ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు 407 కోట్ల రూపాయలు కేటాయించవలసిందిగా తిరుపతి ఐఐటి యాజమాన్యం కోరింది. అయితే తిరుపతి ఐఐటికి ఎంత మొత్తం కేటాయించాలన్న అంశం ఇంకా మంత్రిత్వ పరిశీలనలోనే ఉంది” అని పేర్కొన్నారు. ఐఐటిలకు కేటాయించిన 9361 కోట్ల రూపాయల నుంచే సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి వేతనాలు, చిన్న చిన్న పరికరాలు, లైబ్రరీ పుస్తకాలు, వడ్డీ చెల్లింపులు వంటి వాటి చెల్లింపుల కోసం ఉద్దేశించినవని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్