Saturday, January 18, 2025
Homeసినిమాపుట్టిన‌రోజు బ‌హుమానాన్ని బాధ్య‌త‌తో స్వీక‌రిస్తా : రామ్ చ‌ర‌ణ్‌.

పుట్టిన‌రోజు బ‌హుమానాన్ని బాధ్య‌త‌తో స్వీక‌రిస్తా : రామ్ చ‌ర‌ణ్‌.

Overwhelmed: మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు ఈరోజు. అభిమానుల‌కు పండ‌గరోజు. సినీ ప్ర‌ముఖులు, స్నేహితులు, మెగాభిమానులు చ‌ర‌ణ్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీ ఇటీవ‌లే విడుదలై చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ మూడ్ లో ఉన్న టైమ్ లో రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు రావ‌డంతో ఈ బ‌ర్త్ డేను అభిమానులు చాలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ “ఆర్ఆర్ఆర్ మూవీని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చూసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తా” అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో లేఖలు విడుదల చేశాడు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్