Saturday, November 23, 2024
HomeTrending Newsబిజెపి తెరాసల మిలాఖాత్ - రేవంత్ ఆరోపణ

బిజెపి తెరాసల మిలాఖాత్ – రేవంత్ ఆరోపణ

రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా బీజేపీ టీఆరెఎస్ లు నాటకాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, లా అండ్ ఆర్డర్ అంశం పై చర్చ లేకుండా చేస్తున్నారన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, బోసురాజు ఏఐసీసీ కార్యదర్శి, ఆర్ దామోదర్ రెడ్డి మాజీ మంత్రి, అంజన్ కుమార్ యాదవ్ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్ లు ఈ రోజు గాంధీభవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల పై ప్రజాలదగ్గరికి వెళ్లాల్సిన కార్యాచరణ పై మండల ఇంచార్జ్ లతో జూమ్ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. 1 వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మునుగోడులో నేతలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, మునుగోడులో ఒక్కొక్క నాయకుడికి 40 – 50 లక్షలు ఇచ్చి నాయకులను కొంటున్నారని పరోక్షంగా బిజెపి, తెరాస లపై రేవంత్ రెడ్డి దుమ్మెత్తి పోశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి పై మాట్లాడడం లేదన్నారు. Slbc , దిండి ప్రాజక్టు , పాలమూరు ఎత్తిపోతల పథకం కి బీజేపీ ప్రత్యేక ప్యాకేజి ఇవ్వకపోవడం వల్ల నల్గొండ ప్రజలకి ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. 1 వ తేదీ నుండి మండల ఇంచార్జ్ లు గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్తారని, ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు ఇచ్చి ప్రభుత్వాలపై చార్జిషీట్ ప్రజలకు చూపెడతామన్నారు.

వరంగల్ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే హామీలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టరేట్ ల ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులను  స్వయంగా కలెక్టర్ ఆహ్వానించాల్సిందని, నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లను గృహ నిర్బంధం చేశారని విమర్శించారు. శ్రీధర్ బాబు ని గృహా నిర్బంధం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో హక్కుల నోటీస్ ఇచ్చి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాన్ని పరామర్శించలేదని.. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేదని, తెలంగాణలో చనిపోయిన సైనికులకు ఆర్థిక సహాయం చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ గల్వన్ లో చనిపోయిన బీహార్ సైనికులకు , సికింద్రాబాద్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహయం చేస్తా అంటున్నారని, ముందు తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చి ఇతరుల అవసరాలు తీర్చాలన్నారు. దేశాన్ని దోచుకోవడానికి తెలంగాణ మోడల్ పేరుతో రాజ్యాన్ని విస్తరించుకోవాలని కేసీఆర్ బయలు దేరాడని విమర్శించారు. తెలంగాణలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

గులాం నబీ ఆజాద్ నరేంద్ర మోడీ కి గులాంగా మారాడని ఆరోపించారు. రాజ్యసభ రెన్యూవల్ కాలేదనే చిన్న కారణం చేత కాంగ్రెస్ పార్టీ ని నాయక్వతన్ని దూషించడం దేశ ప్రజలు క్షమించరన్నారు. కాశ్మీర్ కోసం కొట్లాడతా అంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఇంచార్జ్ ఇచ్చింది కదా.. మరి కాంగ్రెస్ నుండి పోరాడకుండా సొంత పార్టీ ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ పర్యటనను ఎవరు సీరియస్ గా తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఏ పని చేసిన పిచ్చివాడి చర్యగానే చూస్తామని, మీటర్ల పై పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు టీఆరెస్ ఎంపీలు హాజరుకాలేదు.. బీజేపీతో ఒప్పందంలో బాగంగానే అలా చేశారని ఆరోపించారు. ఆ బిల్లును కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తారని, కేసీఆర్ ఇంటికి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లకు ఈడీ, సీబీఐ ఎందుకు రాదని రేవంత్ అన్నారు. కెసిఆర్ మోడీలు ధరల పెరుగుదల పై ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత పెరు వచ్చినప్పుడు 30 మంది ఇళ్లపై సీబీఐ విచారణ చేసినప్పుడు కవిత ఇంటిపై ఎందుకు చేయలేదన్నారు. బీజేపీ నేతలు తరుణ్ చుగ్ నుంచి పీఎం మోడీ దాకా అందరూ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతి పైన మాట్లాడుతున్నారు.. ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కానీ ఎవరిపైన చర్యలు తోసుకోరన్నారు. ఈ విషయాలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రేవంత్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఎన్నికల కమిషన్ ఇంకా చెప్పలేదని, సరైన సమయానికి అభ్యర్థి ని ప్రకటిస్తామని రేవంత్ వెల్లడించారు.

Also Read : బిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్