Saturday, January 18, 2025
HomeTrending Newsభారత్ జోడో యాత్రపై టిపిసిసి సమాలోచనలు

భారత్ జోడో యాత్రపై టిపిసిసి సమాలోచనలు

దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర దేశంలోనే కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని టీపీసీసీ నాయకులు ప్రకటించారు. గురువారం ఇందిరా భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన భారత్ జోడో పై టీపీసీసీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొనగా ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్షయ్య, వి.హనుమంతరావు వర్కింగ్ ప్రెసిడెంట్ల అంజన్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి,చైర్మన్ లు మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రాజా నర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, బోసు రాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, కన్వీనర్ బలరాం నాయక్, మాజీ మంత్రి రేణుక చౌదరి, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.


ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏ నాయకులు చేయలేని సాహసం రాహుల్ గాంధీ చేసారని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేస్తున్న  యాత్ర ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు అయ్యి పని చేయాలన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ను చూసి మొదట ఎద్దేవా చేసినా బీజేపీ నాయకులు ఇప్పుడు భయపడుతున్నారని, గతంలో అవాకులు చెవాకులు మాట్లాడిన నాయకులు ఇప్పుడు నోరు ముసుకున్నారని అన్నారు.

Also Readభారత్ జోడో యాత్రలో సోనియా గాంధి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్