Monday, May 20, 2024
HomeTrending Newsవసూళ్ళ కోసం కలెక్టర్ లకు టార్గెట్ - ఈటెల సంచలన వ్యాఖ్యలు

వసూళ్ళ కోసం కలెక్టర్ లకు టార్గెట్ – ఈటెల సంచలన వ్యాఖ్యలు

2004 నుండి 2014 వరకు తెలంగాణ నినాదంతో గెలిసినం తప్పడబ్బులు పెట్టలేదని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2014 తరువాత మొదట డబ్బులు ఇచ్చింది వరంగల్ ఉప ఎన్నికలో.. నారాయణ్ ఖేడ్ నుండి హుజూరాబాద్ వరకు డబ్బులతో ఎన్నికలు కొట్లడారు కెసిఆర్ అని విమర్శించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిఎం కెసిఆర్ పాలన తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. పట్టభద్రులు కూడా డబ్బులు ఇచ్చి వెలకట్టి mlc ఎన్నికలు గెలిచారన్నారు. ఇప్పుడు కెసిఆర్ కి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి. B ఫామ్ నేనే ఇస్తా డబ్బులు కూడా నేనే ఇస్తా అని 2018 లో చెప్పాడు. గెలవండి బానిసలలాగా ఉండండి అని చెప్పిన అహంకారి కెసిఆర్.
మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదన్నారు. పరకాల, వరంగల్ అన్నీ బై ఎలక్షన్,  mlc ఎన్నికల,  ghmc.. అన్ని ఎన్నికలకి నేనే సాక్షం అని రాజేందర్ అన్నారు.

సిఎం కెసిఆర్ 2014 నుండి ఇప్పటివరకు దాదాపు 5000 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని ఈటెల రాజేందర్ విమర్శించారు. TRS తీసి BRS పెట్టీ ఎం చెప్తారు. యూపీ బీహార్ లో 50 లక్షల ఉంటే గెలవచ్చు అని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు చేసుకుంటుంటే, తెలంగాణలో ఒక్క బై ఎలక్షన్ వంద కోట్లు ఖర్చు చేస్తా మీరు కూడా డబ్బులు పెట్టండని.. మిగతా పార్టీలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ము పక్క రాష్ట్రాలకు పంపుతున్నారు. కర్ణాటకకు పంపిన నాడు నేనే ప్రత్యక్ష సాక్షి ని అన్నారు. తెలంగాణ ప్రజలారా అవేదనతో,  దుఖంతో చెప్తున్న మాటలు ఒక్కసారి కెసిఆర్ కి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఆలోచించండని కోరారు. ఆంధ్రాలో 5 కోట్లు పెడుతున్నారు అని మేము నోరు వెళ్ళబెట్టేవెళ్ళం. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. పార్టీ అకౌంట్ లో 870 కోట్లు ఉన్నాయి అని  సగర్వంగా చెప్తున్నారు. ఎక్కడిది ఈ డబ్బు అన్నారు.

 

ఫార్మా కంపెనీలు, కాంట్రాక్టర్స్ ఎందుకు ఇంత డబ్బు ఇస్తున్నారు? వారికి ఏమీ లాభ చేయకుండా.. ఈ డబ్బు ఎక్కడ నుండి వచ్చింది సమాధానం చెప్పాలని రాజేందర్ డిమాండ్ చేశారు. ధరణీ తెచ్చి భూములను కెసిఆర్ కుటుంబం కబ్జా పెడుతున్నారు. దేవాలయాల, వక్ఫ్,అసైన్ మెంట్ అన్ ఐడెంటిఫిేషన్ భూములు వేలాది ఎకరాలు కబ్జా పెట్టారు. 24 లక్షల రైతులు  గగ్గోలు పెడితే 6 లక్షలు మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఇంకా 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గగ 2000 ఎకరాలు మాయం చేసి లక్ష కోట్లు కొల్లగొట్టారు. బినామీల పేరిట రాసుకుంటున్నారు. హైదరాబాద్ లో  నాగార్జున సర్కిల్ నుండి KBR పార్క్ వరకు కుడివైపు ఉన్న భూములు అన్నీ ఖాళీగా ఉండేవి. లిటిగేషన్ ఉన్న భూములు క్లియర్ చేసి కెసిఆర్ డబ్బులు దండుకున్నారు.
వంశింరాల్ బిల్డర్స్ కడుతున్నారని రాజేందర్ చెప్పారు.

సీఎం ఆఫీస్ లో రాజ్యసభ సభ్యుడు ఉంటాడు ఆయన సీఎం కి చెప్తే సీఎం cs కి చెప్తే, cs కలెక్టర్ కి చెప్తే వెంటనే  సమస్యల్లో ఉన్న భూమి క్లియర్ అవుతుందని రాజేందర్ చెప్పారు. చిన్న ఉద్యోగులకు తెలవద్దు అని వారిని తొలగించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కలెక్టర్లకు కలెక్షన్ కోసం కెసిఆర్ టార్గెట్ పెట్టారన్నారు. ఆ దుర్మార్గ సంపాదనతో మునుగోడుకి వస్తున్నారని విమర్శించారు.  మంత్రులు సచివాలయంలో  ఉండాలి కానీ ఎమ్మెల్యేల, మంత్రుల బ్రతుకు ఊర్లలకోకి పోయి మందు తాగిపించే బ్రతుకు అయ్యింది. మంత్రులారా వినమ్రంగా అడుగుతున్న మీ బ్రతుకునెంత దిగజార్చాడు చూడండి. నా మీద దాడి చేయకండి అలోచన చేయండని ఈటెల రాజేందర్ సూచించారు.

మర్రిగూడలో జరిగిన ప్రెస్ మీట్ లో జితేందర్ రెడ్డి, మర్రి గూడెం ఎన్నికల ఇంఛార్జి  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆచారి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తుల ఉమ, గండ్ర నళిని, పోతపాక సాంబయ్య, అమరేందర్ రెడ్డి, అనంత రాజు, పిట్టల శ్రీను, శ్రీనివాస రావు, మేతరి యాదయ్య, రాజేందర్ నాయుడు పాల్గొన్నారు.

Also Read : రియల్ వ్యాపారులకు రైతుబంధు ఈటెల విమర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్