యూరోప్ లోని గ్రీస్ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాదం థెస్స – లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి.
దీంతో చాలా బోగీలు పట్టాలు తప్పగా.. మరో బోగీలకు మంటలు అంటుకున్నాయి. ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికి తీయగా, 85 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.