Sunday, November 24, 2024
HomeTrending NewsTERI: రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం

TERI: రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. సత్వర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 ట్రామా కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రామా, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, మాతా శిశు అత్యవసర సేవలను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ (టెరి)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు.

ఎమర్జన్సీ విభాగంలో 30 బెడ్స్, టీవీవీపీ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి 5,10,15,20 బెడ్స్ ఎమర్జెన్సీకి కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్ రే, ఈ ఫాస్ట్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, వంటి అవసరమైన, అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. ట్రామా సెంటర్లలో ఏడు విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ట్రామా కేర్ సెంటర్ లో ఉంటారు. లెవల్ 1లో 237 మంది, లెవల్ 2లో 101 మంది, లెవల్ 3లో 73 మంది ఉండి సేవలందిస్తారు. ట్రామా కేర్ సిబ్బందికి జిల్లా స్థాయిలోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ అందజేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్