Saturday, November 23, 2024
HomeTrending Newsరాజ్యసభకు సుష్మిత దేవ్

రాజ్యసభకు సుష్మిత దేవ్

తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత సుష్మిత దేవ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.  పశ్చిమ బెంగాల్ నుంచి ఒక సీటుకు అవకాశం ఉండగా పోయిన వారం సుష్మిత దేవ్ టి.ఎం.సి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ఎవరు బరిలో దిగక పోవటంతో సుష్మిత ఎన్నిక లాంచనంగా ప్రకటించాల్సి ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ ప్రజలకు సేవ చేసేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన మమత దీదీకి రుణపడి ఉంటానని సుష్మిత కృతజ్ఞతలు తెలిపారు. టి.ఎం.సి తరపున తాను రాజ్యసభకు వెళ్ళటం ద్వారా ఈశాన్య రాష్ట్రాల అన్నింటికీ తృణముల్ కాంగ్రెస్ ప్రజాగొంతుకగా నిలుస్తుందని సుష్మిత అన్నారు.

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న సుష్మిత దేవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే రాజ్యసభకు అవకాశం రావటం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుష్మిత గతంలో అస్సాం సిల్చార్ నుంచి MPగా ప్రాతినిధ్యం వహించారు.

దేశవ్యాప్తంగా ఆరు రాజ్యసభ సీట్ల కోసం ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తమిళనాడులో రెండు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్ లలో ఒకటి చొప్పున రాజ్యసభ సీట్లకు అక్టోబర్ 4 వ తేదిన ఉపఎన్నికలు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్