Saturday, June 13, 2026
Homeసినిమాత్రివిక్రమ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ..?

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ..?

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిన ప్రతిసారీ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అనేవారు. అయితే.. ఆమధ్య మోక్షజ్ఞ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అసలు ఆయనకు సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ ఉందా..? లేదా..?  అనే డౌట్ కూడా వచ్చింది సినీజనాలకు. అంతే కాకుండా.. మోక్షజ్ఞకు సినిమాల పై ఆసక్తి లేదని… ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వచ్చాయి.

ఆతర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ అనేది వార్తల్లో నిలిచింది. ఇంతకీ విషయం ఏంటంటే…గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య ప్రకటించలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కల్లా ఫినిష్ చేస్తారట. సమ్మర్ తర్వాత నుంచి మోక్షజ్ఞ సినిమా పై త్రివిక్రమ్ వర్క్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వార్త పై ఇంత వరకు అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య చెప్పారు. అయితే, ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దిశగా మోక్షు కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. మరి… ప్రచారంలో ఉన్నట్టుగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? లేదో.. చూడాలి.

Also Read :  మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular