పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో, రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు పిలుపివ్వనున్న సిఎం కెసిఆర్. ఈ సందర్భంగా..లోక్ సభ రాజ్యసభల్లో టిఆర్ఎస్ ఎంపీలు అవలంబించవలసిన పలు కీలక అంశాలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా… తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలని టిఆర్ఎస్ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సిఎం కెసిఆర్ సూచించనున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై కార్యాచరణ ఇస్తారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజల తరఫున టిఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో బిజెపి కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సిఎం కెసిఆర్ రేపటి సమావేశంలో ఎంపీలకు పిలుపునివ్వనున్నారు.