Saturday, March 14, 2026
HomeTrending Newsలోక్ సభలో TRS ఎంపీల నిరసన

లోక్ సభలో TRS ఎంపీల నిరసన

Trs Mps Protest :

లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు  ఈ రోజు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్య సభ, లోక్ సభలలో కొనసాగుతున్న ఎంపీల నిరసన. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో TRS పార్టీ ఎంపిలు నినాదాలు చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఫ్లకార్డుల ప్రదర్శన. దేశ రైతాంగం కోసం గత వారం రోజులుగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేస్తూ, నిరసన తెలుపుతున్న TRS పార్టీ ఎంపీలు. రైతులపై ఎక్కుపెట్టిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం, ధాన్యం కొనుగోళ్ల పై స్పష్టతను ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. కేంద్ర వైఖరిని పార్లమెంటు లోపలా, బయట నిరసిస్తూ, దేశ రైతాంగానికి మద్దతుగా TRS ఎంపీలు ఆందోళన బాట పట్టారు.

Also Read :ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular