Thursday, April 25, 2024
HomeTrending Newsకబ్జాకోరు ఈటెల రాజేందర్

కబ్జాకోరు ఈటెల రాజేందర్

Itala Rajender Occupied 70 Acres Of Land :

ఎస్సి,ఎస్టీల భూములను ఈటల రాజేందర్ భార్య జమున అడ్డగోలుగా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. జమున హెచరీస్ కోసం ప్రభుత్వ, ఎస్సి, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారన్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ లు పాల్గొన్నారు. నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

కబ్జాలు చేసేది వీల్లే, నోరు లేని పేదల భూములను లాక్కుంటారు, పర్యావరణానికి హాని కలిగిస్తారు, మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తారని మండిపడ్డారు. తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అన్నాడు ఈటల రాజేందర్, ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని,  కబ్జాకోరు దగాకోరు లాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని హుజురాబాద్ ప్రజలు గమనించాలన్నారు. అక్కడి కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడని, కానీ అతన్ని భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గూ తేల్చాలని బల్క సుమన్ కోరారు. అధికారులను, కలెక్టర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈటల రాజేందర్,అతని భార్య మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉంది కేంద్రం తీరు ఉందని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఒక వార్షిక ప్రణాళిక చేయండి అంటే ఆ ఊసే ఎత్తడం లేదని, ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే కేంద్రం పట్టించుకోకుండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొండి వైఖరి, దుర్మార్గమైన వైఖరితో కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. ధర్మపురి అరవింద్ అసలు మనిషేనా..ధర్మపురి అరవింద్ బట్టలూడదీసి కొట్టాలి..పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ తీసుకొచ్చాడా అని సుమన్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేసిన పనులు ఏమైనా అరవింద్ కు తెలుసా..రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ కోసం పనిచేయలేదన్నారు. దొంగలకు హైద్రాబాద్ అభివృద్ధి ప్రదాత కే టీ ఆర్ ను విమర్శించే హక్కు ఉందా? ఒక్కనాడు కూడా పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేయలేదని, ఢిల్లీలో దావత్ లు చేసుకుంటూ కూర్చున్నారు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు..నోట్ల కట్టలు పట్టుకొని దొరికిన దొంగ రేవంత్..అతను కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. వీళ్ళకి కేటీఆర్ పైన మాట్లాడే అర్హత లేదు..Tspsc సభ్యుడి గా అవకాశమిచ్చివిఠల్ ను గౌరవించింది టీఆర్ఎస్..పదవి లేకపోతే టీఆర్ఎస్ ను తిట్టడమేనా అన్నారు. పదవి పోగానే టీఆర్ఎస్ ను విమర్శించడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు.

ఒక్క ఎకరానికి ఒకసారి ముక్కు నేలకు రాస్తా అన్నఈటల 71 ఎకరాలు కబ్జా చేసాడు అంటే 71 సార్లు ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఇన్నిఎకరాలు కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లను ఈటెల బెదిరిస్తున్నాడని, అవినీతికి పాల్పడుతున్న ఈటల రాజేందర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలన్నారు.

Also Read : 10 రోజుల్లోనే ఏసంగి రైతుబంధు

RELATED ARTICLES

Most Popular

న్యూస్