టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రేపు హెచ్ఐసీసీలో జరగనుంది. ఇందు కోసం సర్వం సిద్దమైంది. ఉదయం 11 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ప్లీనరీని పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్లీనరీకి 3000 మంది ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. హాజరయ్యే ప్రతినిధులకు బార్ కోడ్‌తో కూడిన ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రతినిధులను లోనికి అనుమతిస్తారు. తెరాస ప్లీనరీలో 11 అభివృద్ధి, రాజకీయ అంశాలపై తీర్మానాలు జరగనున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండగ నిర్వహించనుంది.
Also Read : పంటల మార్పిడితో రైతులకు మేలు -మంత్రి నిరంజన్