కనీస మద్ధతు ధర చట్టం, రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదిస్తూ నిరసన తెలిపిన టీఆరెస్ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభ,లోక్ సభలో బైఠాయించి నిరసనలతో హోరెత్తించారు. టిఆర్ఎస్ ఎంపీల నిరసనలతో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలుపై మొదటి రోజు నుంచి లోక్ సభలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన.
రైతులకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లోపల ,బయట ప్లకార్డుల తో తెరాస ఎంపి లు నిరసనలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరేట్టినట్టుగా వ్యవహరిస్తోందని గులాబి పార్టీ నేతలు విమర్శించారు. గత మూడు రోజుల నుండి సభలను స్తంభింప చేస్తున్న టీఆరెస్ ఎంపీలు తెలంగాణ రైతాంగంకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.