Monday, June 17, 2024
HomeTrending Newsఅంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం

అంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం

Effect Of Omicron  :

అంతర్జాతీయ విమానాల సేవలను డిసెంబర్​ 15 నుంచి పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు ఈ రోజు (బుధవారం) భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.

కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఇటీవల ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోఅంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను డీజీసీఏ వాయిదా వేసింది.

అయితే 28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా నిర్దేశించిన దేశాలకు ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

Also Read :  రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్