Saturday, March 14, 2026
HomeTrending NewsCM KCR: నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల ప్రోత్సాహం

CM KCR: నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల ప్రోత్సాహం

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికలమీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. సచివాలయం లో నిఖత్ జరీన్ సిఎం కేసీఆర్ తో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు కావాల్సిన శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ. 2 కోట్లను సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular