Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్హెచ్.సి.ఏ. బలోపేతానికి చర్యలు: మంత్రి ఆదేశం

హెచ్.సి.ఏ. బలోపేతానికి చర్యలు: మంత్రి ఆదేశం

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్లబ్ లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డా.వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.  హైదరాబాద్ నగరంలో ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాదిరిగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో జిహెచ్ఎంసి తోపాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో  క్రికెట్ క్లబ్ ల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా తో  సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో క్రికెట్ మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బలోపేతం చేయాలని , సంస్థ  విస్తరణకు తగిన కార్యాచరణ ను రూపొందించాలని, 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటి లను తక్షణమే ఏర్పాటు చేసి తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TRS నాయకులు కొండల్ రావు, మున్సిపల్ శాఖ అధికారులు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular