Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

సిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్బంగా తిరుమల అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించారు.

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు, అధికారులుకూడా సిఎంకు ప్రసాదం ఇచ్చి సత్కరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈవో భ్రమరాంభ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular