Saturday, January 18, 2025
HomeTrending Newsతిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు  రద్దు

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు  రద్దు

Heavy Crowd: భక్తుల రద్దీ కారణంగా కారణంగా రేపు బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. తిరుపతిలో సర్వదర్శనం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా క్యూ లైన్లో తొక్కిసలాట జరిగింది.

ఎల్లుండి గురువారం నుంచి నాలుగు రోజులపాటు వరుస సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకున్నారు. నేటి ఉదయం సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తారని టిటిడి ప్రకటించడంతో వీటికోసం నాలుగు రోజులనుంచే భక్తులు ఎదురుచూపులు చూస్తున్నారు. నేడు టిక్కెట్లు వచ్చే సమయానికి ఒక్కసారిగా భక్తులుకౌంటర్లకు చేరుకోవడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. పలువురు చిన్నారులు, చిన్నారుల తల్లులు ఊపిరి ఆడక ఇబ్బంది  పడ్డారు.

తీవ్రతను గమనించిన టిటిడి అధికారులు సర్వదర్శనం కోసం టిక్కెట్లు అవసరం లేదని, నేరుగా కొండపైకి చేరుకొని క్యూ లైన్ల ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని ప్రకటించారు.

Also Read : రాములో! రాములా! ఇంతకూ నీవెవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్