విఐపి బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 10నుంచి 12గంటల మధ్యకు మార్చాలని, తిరుపతిలో 25వేల సర్వదర్శనం టిక్కెట్లను కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల తర్వాత ఈ నిర్ణయాలను అమలు చేయనున్నారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టిటిడి బోర్డు సమావేశమైంది. శ్రీవారి ఆస్తులపై శ్వేత పత్రం కూడా విడుదల చేశారు.
శ్రీవారి మొత్తం ఆస్తుల విలువ- రూ. 85,750కోట్లు; మొత్తం ఆస్తుల సంఖ్య- 960
టిటిడి నిర్ణయాలు:
రూ. 95కోట్లతో నూతన వసతి భవన నిర్మాణం
రూ. 7.90కోట్లతో తిరుమల వసతి గృహాల్లో గీజర్ల ఏర్పాటు
రూ. 6.37 కోట్లతో తిరుపతి ఎస్వీ కళాశాల అభివృద్ధి
వకుళామాత ఆలయం నుంచి జూ పార్కు వరకు రూ. 30 కోట్లతో రోడ్డు నిర్మాణం
నందకం రెస్ట్ హౌస్ లో 340గదుల్లో కొత్త ఫర్నీచర్ ఏర్పాటుకు రూ. 2.40 కోట్లు
టిటిడి ఉద్యోగుల యూనిఫాం కొనుగోలుకు 2.5 కోట్లు
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల మంజూరు
దీనికోసం ౩౦౦ ఎకరాలతో పాటు మరో 130 ఎకరాల భూమి కొనుగోలు
నెల్లూరులో శ్రీవారి ఆలయం, కళ్యాణమండపం నిర్ణయం
తిరుపతిలో 25వేల సర్వదర్శనం టిక్కెట్ల పంపిణీ
Also Read : భక్తుల మధ్యే బ్రహ్మోత్సవాలు: టిటిడి ఈవో