Saturday, November 23, 2024
HomeTrending Newsవచ్చే వారం తాలిబన్లతో అమెరికా చర్చలు

వచ్చే వారం తాలిబన్లతో అమెరికా చర్చలు

తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా ఇంకా గుర్తించ లేదు. కేవలం పాకిస్తాన్. చైనా, రష్యా దేశాలు మాత్రమే తాలిబన్లతో సంబంధాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ మూడు దేశాలతో తాలిబన్లు జత కడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అమెరికా భావిస్తోంది. దీంతో దఫా దఫాలుగా తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి థామస్ వెస్ట్ వచ్చే వారం తాలిబాన్ నేతలతో సమావేశం కానున్నారు.

ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి నేతృత్వంలో విద్య, వైద్యం, ఆర్థిక శాఖల అధికారులతో పాటు రక్షణ, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఆఫ్ఘన్ ప్రతినిధులతో కూడిన బృందం చర్చల్లో పాల్గొంటుంది. ఈ నెల 27వ తేది నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఖతర్ రాజధాని  దోహలో జరిగే ఈ చర్చల్లో ఉగ్రవాదం నిర్మూలన, ఆఫ్ఘన్లో మానవతా సాయం చేసే సంస్థలను అనుమతించటం,ఆఫ్ఘన్ కు అమెరికా పౌరుల రాకపోకలపై ఆంక్షలు ఎత్తేయటం తదితర అంశాలపై చర్చించనున్నారు.

తాలిబన్లు అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి అమెరికా చర్చలు జరుపుతున్నా కొలిక్కి రావటం లేదు. థామస్ వెస్ట్ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం జరిగిన తర్వాత చర్చల ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే యూరోప్, ఆసియ దేశాలతో టామ్ ఆఫ్ఘన్ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నెల ఎనిమిదవ తేదిన బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో ఈయు, అమెరికా మిత్ర దేశాలతో థామస్ సమావేశమయ్యారు. ఇటీవల త్రోయిక పేరుతో ఇస్లామాబాద్ లో జరిగిన సమావేశంలో టామ్ వెస్ట్ అమెరికా తరపున పాల్గొన్నారు. రష్యా, చైనా, ఇరాన్, పాకిస్తాన్, అమెరికాతో పాటు తాలిబాన్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్