Thursday, January 23, 2025
Homeజాతీయంసొంత యాప్ చేసుకుంటాం : ప్రధానికి ఉద్ధవ్ లేఖ

సొంత యాప్ చేసుకుంటాం : ప్రధానికి ఉద్ధవ్ లేఖ

కోవిన్ యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత యాప్ తయారు చేసుకునేందుకు అనుమతివ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు.

కోవిన్ సైటులో వాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేదుకు కేంద్ర ఆరోగ్య శాఖ 4 అంకెల సెక్యురిటి కోడ్ ని ప్రవేశపెట్టింది. ఈ కోడ్ పెట్టిన తర్వాత కోవిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్ధవ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. సొంతంగా యాప్ తయారు చేసుకొని ప్రజలకు వాక్సిన్ అందే విధంగా చూస్తామని కోరారు.

దేశవ్యాప్తంగా అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా వుంది. గత24 గంటల్లో రాష్ట్రంలో 54 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్