Sunday, January 19, 2025
HomeTrending Newsత్వరలో ఉద్దవ్ థాకరే -కెసిఆర్ భేటి

త్వరలో ఉద్దవ్ థాకరే -కెసిఆర్ భేటి

Uddhav Thackeray Kcr Meeting : 

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్‌కు ఉద్ధ‌వ్ థాక్రే ఫోన్ చేసి.. బీజేపీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఆయ‌న సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు.
ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. ‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని పేర్కొన్నారు.
‘మిమ్మల్ని ముంబ‌యికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్