Friday, October 18, 2024
Homeసినిమాశివకార్తికేయన్ స‌ర‌స‌న‌ ఉక్రేనియన్ బ్యూటీ

శివకార్తికేయన్ స‌ర‌స‌న‌ ఉక్రేనియన్ బ్యూటీ

Ukraine beauty: ప్రముఖ హీరో శివకార్తికేయన్ దర్శకుడు అనుదీప్ కెవి రూపొందిస్తున్న సినిమా ద్వారా తెలుగులో మొదటి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. `జాతిరత్నాలు` బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిన అనుదీప్ మంచి గుర్తింపు పొందాడు అనుదీప్.  తెలుగులో ఇటీవలే `వరుణ్ డాక్టర్`తో విజయం పొందిన శివకార్తికేయన్ కోసం సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఆమె ఇప్పటికే రెండు ఉక్రేనియన్ సినిమాల్లో నటించింది అంతేకాక ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ స్పెషల్ ఆప్స్లో ప్రధాన పాత్ర పోషించింది.

ఈ చిత్రం శివకార్తికేయన్ కు 20వ చిత్రం. #SK20 విభిన్నమైన కాన్సెప్ట్ తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందబోతోంది. ఈ చిత్ర కథ బ్యాక్ డ్రాప్ పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

Also Read :  శివ కార్తికేయన్, అనుదీప్ మూవీ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్