Friday, May 31, 2024
Homeసినిమాఅజిత్‌ అతి పెద్ద పోస్టర్‌ సంచలనం

అజిత్‌ అతి పెద్ద పోస్టర్‌ సంచలనం

Heavy Poster: తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన ‘వలీమై’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాం పై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం ZEE5` సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యింది.
అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్‌ అవుతూ అజిత్‌ ఇమేజ్‌ను మరింతగా పెంచుతోంది. అందరూ ఈ పోస్టర్‌ను చూసి అభినందిస్తుంటే.. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅజిత్‌ అభిమానులతో పాటు, భారతీయ ప్రేక్షకుల కోసం ఈనెల 25 నుంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం ‘వలీమై’ మా జీ`5 ఓటీటీలో ప్రదర్శిస్తుండటం చాలా గర్వంగా ఉంది అన్నారు.
2022లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా వలీమై.ఇందులో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ఫుల్ యాక్షన్ ఏంటర్ టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో  కూడిన క్లీన్ కాప్ డ్రామా గా తెరకెక్కిన  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వలిమై.. నటుడు అజిత్ కుమార్ మాగ్నెటిక్ స్క్రీన్ వ్యక్తిత్వం మరియు కార్తికేయ యొక్క సాతాను అవతార్ మధ్య జరిగిన ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల స్పందనతో సినిమా హాళ్లు సైతం దద్దరిల్లిపోయాయి. హెచ్.వినోత్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్