Wednesday, March 26, 2025
HomeTrending Newsమల్లన్న సేవలో అమిత్ షా

మల్లన్న సేవలో అమిత్ షా

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సతీసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.

అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు.

తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు.  శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లి వివరించారు. అనంతరం పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలును నాటి నీళ్ళు పోశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్