Monday, June 17, 2024
Homeసినిమా‘లైగర్’ టీజర్ రాబోతుందా.?

‘లైగర్’ టీజర్ రాబోతుందా.?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. కరోనా కేసులు తగ్గడంతో ఆగిన సినిమాల షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి కానీ.. లైగర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని లైగర్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. లైగర్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాలని పూరి టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ టీజర్ కి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం. తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలియచేశారు. ”యువర్ బాయ్ ఈజ్ బ్యాక్ – వర్క్ ఫ్రమ్ హోమ్.. లెట్స్ గెట్ థింగ్స్ మూవీంగ్” అని విజయ్ ట్వీట్ చేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఆయన మైక్ ముందు నిలబడి ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకొని.. మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతూ కనిపించాడు. దాంతో ఇది గ్యారెంటీగా లైగర్ టీజర్ కోసమే.. అంటున్నారు అభిమానులు.

ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అందరూ అటు విజయ్ అభిమానులు ఇటు పూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. మరి.. టీజర్ లో షూటింగ్ గురించి.. అలాగే రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్