Sunday, January 19, 2025
HomeTrending Newsఎలక్షన్ల కోసం కేసియర్ కలెక్షన్లు: కిషన్ రెడ్డి

ఎలక్షన్ల కోసం కేసియర్ కలెక్షన్లు: కిషన్ రెడ్డి

ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేయడం, వాటిని ఖర్చుపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మర్చిపోవడం ముఖ్యమంత్రి  కేసియార్ నైజమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేసియార్ తన కుర్చీ కోసం, కుటుంబం కోసం దేనికైనా దిగజారే పరిస్థితి వచ్చిందని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ జరిగిందని ఆరోపించారు.  జన ఆశీర్వాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఏడేళ్ళుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒక్క అవినీతి మారక కూడా లేదని, నీతి నిజాయతీగా పని చేస్తున్నారని, ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఇళ్ళ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వాటిని ప్రజలకు అందించడంలో కెసియార్ ప్రభుత్వం విఫలమైందని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రగతి భవన్ ను పట్టుబట్టి నిర్మించుకున్న కేసియార్ పేదల ఇళ్ళ నిర్మాణాన్ని విస్మరించారని  అన్నారు.

ధనిక రాష్ట్రం తెలంగాణా ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం, ఎంతోమంది ఆత్మా బలిదానాలతో ఏర్పడిన తెలంగాణా ఇప్పుడు కేసియర్ కుటుంబ చేతిలో బందీ అయ్యిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేస్తోందని. తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోన్ని గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్