Saturday, April 20, 2024
Homeసినిమాబన్నీతో బుచ్చిబాబు.?

బన్నీతో బుచ్చిబాబు.?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నారు. మొదటి పార్ట్ ను ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ బన్నీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ‘ఐకాన్’ అనే స్టోరీ రెడీ చేయడం.. బన్నీకి గతంలో చెప్పడం.. కథ నచ్చి ఈ సినిమా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు.

ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా తెరకెక్కిస్తోన్న బోయపాటి శ్రీను కూడా బన్నీతో  సినిమా చేసేందుకు పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు. వేణు శ్రీరామ్, బోయపాటి శ్రీను.. వీరిద్దరితో పాటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారని సమాచారం. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేయడం.. ఎన్టీఆర్ కు చెప్పడం కూడా జరిగింది. అయితే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు.

ఆతర్వాత బుచ్చిబాబుతో సినిమా అంటే… చాలా టైమ్ పడుతుంది. అందుచేత ఈలోపు మరో సినిమా చేయాలని బుచ్చిబాబు బన్నీని కలిసాడని తెలిసింది. ఎన్టీఆర్ తో చేయాలనుకున్న కథనే బన్నీకి చెప్పనున్నాడా..? లేక బన్నీ కోసం వేరే స్టోరీ రెడీ చేస్తున్నాడా.? అనేది తెలియాల్సివుంది. మరి.. బుచ్చిబాబు కథకు బన్నీ ఎస్ చెబుతాడో నో చెబుతాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్