Wednesday, February 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సహకరించండి: జగన్ కు ఆనందయ్య లేఖ

సహకరించండి: జగన్ కు ఆనందయ్య లేఖ

ఆయుర్వేద మందును ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ఆనందయ్య ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీకి కావాల్సిన ఔషధాలు, ముడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేసేందుకు, సమీకరించేందుకు సహకరించాలని లేఖలో కోరారు.  కాగా, నేడు రెండో రోజు నెల్లూరు జిల్లా మనబోలు మండలంలో ఆనందయ్య మందును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో పలు చోట్ల ఆనందయ్య మందు పేరిట కొంతమంది సొంతంగా మందుల తయారీ మొదలు పెట్టారు. దీనిపై స్పందిస్తూ ‘పలు చోట్ల మందు తయారీ చేస్తున్నట్లు తెలిసిందని, అది నకిలీ మందుగా గుర్తించాలని ఆనందయ్య కోరాడు. అలాంటి మందుల వాళ్ళ ఏవైనా దుష్పరిణామాలు సంభవిస్తే తనకు చెడ్డపేరు వస్తుందని, కాబట్టి మందును  తన ప్రమేయం లేకుండా తయారు చేసున్నవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి  ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్