Sunday, January 19, 2025
HomeTrending NewsCivil Servants: సిఎంను కలిసిన సివిల్స్ విజేతలు

Civil Servants: సిఎంను కలిసిన సివిల్స్ విజేతలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని సివిల్స్ ర్యాంకర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి యూపీఎస్‌సీ (సీఎస్‌ఈ) 2022 లో ఆలిండియా సర్వీసులకు ఎన్నికైన 17 మంది ర్యాంకర్లు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు. వీరిని అభినందించిన సిఎం జగన్.. వారి కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జీవీఎస్‌ పవన్‌ దత్తా, తిరుపతి (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్, గుంటూరు (60), ఎల్‌.అంబికా జైన్, కర్నూలు (69), షేక్‌ హబీబుల్లా, కర్నూలు (189), కేపీఎస్‌ సాహిత్య, వైజాగ్‌ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి, కదిరి (270), పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, విజయవాడ (292), వి.లక్ష్మీ సుజాత, మార్టూరు (311), బి.వినూత్న, ఒంగోలు (462), సీ.సమీర్‌ రాజా, ఆదోని (464), ఆర్‌.నవీన్‌ చక్రవర్తి, తాళ్ళచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్‌ఎల్‌ రమణి, ఎదరాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్, చిలకలూరిపేట (593), పి.భార్గవ్, విజయనగరం (772), కే. శ్రీకాంత్‌ రెడ్డి, శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్‌ సంపత్, నందిగామ (805), ఎన్‌. కృపాకర్, కడప (866) లు సిఎన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్