Sunday, November 3, 2024
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ లో బ్లింకెన్ పర్యటన

ఇజ్రాయెల్ లో బ్లింకెన్ పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. మధ్య తూర్పు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆయన జెరూసలేంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్- గాజా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు అయన రంగంలోకి దిగారు.  అయితే ఇజ్రాయెల్ తో పాటు ప్రాచ్య దేశాలు హమాస్ పాలకులను తీవ్రవాదులుగా పరిగణిస్తూ ఉండడంతో తాజా ప్రక్రియలో ఎక్కడా హమాస్ భాగస్వామ్యం లేకుండా చూడడంపై బ్లింకెన్ దృష్టి సారించారు.

ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమేన్ నేతన్యాహుతో  బ్లింకెన్ సమావేశమయ్యారు. గాజా పునర్నిర్మాణం, క్షతగాత్రులకు సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ హమాస్ కు మేలు చేకూర్చే ఏ  ప్రక్రియను తాము అంగీకరించబోమని నేతన్యాహు తేల్చి చెప్పారు.

గత శుక్రవారం కాల్పుల విరమణకు మాత్రమే సంధి కుదిరింది, కానీ ఇరుపక్షాలు లేవనెత్తుతున్న మౌలిక అంశాలపై ఎలాంటి నిర్ణయం జరగలేదు, దీనిపై కూడా బ్లింకెన్ చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేసిన తర్వాత అమెరికాకు చెందిన ఓ మంత్రి ఇజ్రాయెల్ లో పర్యటిస్తుండడం విశేషం

RELATED ARTICLES

Most Popular

న్యూస్