Sunday, June 14, 2026
Homeసినిమాసంక్రాంతి రేసులో ఉస్తాద్ భగత్ సింగ్?

సంక్రాంతి రేసులో ఉస్తాద్ భగత్ సింగ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. సినిమాలకు కొబ్బరి కాయలు కొడుతున్నాడు కానీ.. షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయలు మాత్రం కొట్టడం లేదు. దీంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆయా చిత్రాల నిర్మాతలకు కూడా తెలియడం లేదు. ప్రస్తుతం ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేమ్,  సంభాషణలు అందిస్తున్నారు. జులై 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. వస్తుందో లేదో క్లారిటీ లేదు. మరో వైపు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలానే సుజిత్ తో ఓజి సినిమాల షూటింగ్స్ ని కూడా అతి త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 28, ప్రభాస్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజక్ట్ కే 2024 సంక్రాంతి బరిలో బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా వస్తే మొత్తం బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల త్రిముఖ పోరు తప్పదు. హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. సాధ్యమైనంత ఫాస్ట్ గా చిత్రాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular