Saturday, January 18, 2025
HomeTrending Newsఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద ఈ రోజు బిజెపిలో చేరారు. ఢిల్లీ లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం తీసుకున్నారు. అంతకు ముందు యువ నేత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు.  47 ఏళ్ళ జితిన్ యుపిఎ -2 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. జితిన్ రాకను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు.

తమ కుటుంబానికి మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని,అన్నీ ఆలోచించే కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి లో చేరానని జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా అవన్నీ ప్రాంతీయ స్థాయి పార్టీలుగా పనిచేస్తున్నాయని, కేవలం బిజెపి మాత్రమె జాతీయ స్థాయిలో హుందాగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్న్నారు.

లఖీం ఖేరి జిల్లా ధౌరాహ్రా నుంచి 2009లో లోక్ సభకు జితిన్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఏ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శిగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న జితిన్ రాకతో యుపిలో బ్రాహ్మణ ఓట్లు తమకే దక్కుతాయని కమలం నేతలు ఆశాభావంతో ఉన్నారు. రాహుల్ గాంధీకి అనుంగు సహచరులలో ఒకరైన యువ నేత పార్టీని వీడటం ఖచ్చితంగా యుపి కాంగ్రెస్ కు నష్టమే.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మార్చుతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. యోగి కి డోకా లేదని జాతీయ నాయకత్వం తేల్చి చెప్పింది.  ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి జితిన్ షాక్ ఇచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్